, చెన్నై: తమిళనాడు రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి కుమారుడు అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ లోటు ఉందని, ప్రజలను ఆదుకునేందుకు ఓ నాయకుడు కావాలని అన్నారు. అది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మాత్రమే సాధ్యమని ఆళగిరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడూతూ.. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విపక్ష నేతగా విఫలమయ్యారని విమర్శించారు. అలాగే ప్రజల సమస్యలపై అన్నాడీఎంకే ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయ సంక్షోభం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని, ఈ దశలోనే రజనీకాంత్ లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ముందుండు నడిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉందన్నారు.
అది రజనీకి మాత్రమే సాధ్యం..